Harish Rao | కాళేశ్వరం నిర్వహణపై తీవ్ర విమర్శలు

Harish Rao | కాళేశ్వరం నిర్వహణపై తీవ్ర విమర్శలు
Harish Rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులపై తీవ్ర విమర్శలు చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు.
ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారని, పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. మోటార్లు పాడయ్యాయనే నెపాన్ని బీఆర్ఎస్‌పై మోపేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. భారీ మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేయడం ఇంజినీరింగ్ నిబంధనలకు విరుద్ధమని లేఖలో స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సాగునీటి ప్రాజెక్టులతో చెలగాటం ఆడవద్దని హరీశ్‌రావు ప్రభుత్వానికి హితవు పలికారు.
