మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయుబ్ పాషా…

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయుబ్ పాషా…

ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మండల పరిధిలోని రెవల్లి గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు గ్రామ ఉప సర్పంచ్ ఆయుబ్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా నూతనoగా ఎన్నికైన మండల అధ్యక్షులు అయూబ్ పాషా మాట్లాడుతూ…. నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మండలంలో పార్టీ, నాయకుల, కార్యకర్తల సమన్వయంతో పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని ఈ పదవి కోసం సహకరించిన మండల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యకర్తలకు ఎల్లపుడు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply