దిమ్మదుర్తి వద్ద రోడ్డు ప్రమాదం

దిమ్మదుర్తి వద్ద రోడ్డు ప్రమాదం

  • యువకుడు మృతి

మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని దిమ్మదుర్తి క్రషర్ సమీపంలో సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దండుగుల సాయిరాం (23) అనే యువకుడు మృతి చెందాడు.

తెలియని వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న సాయిరాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన వాహనం ఘటన స్థలం నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply