Us Rejects Ceasefire : అమెరికా సైతం.. Andhra Prabha News

Us Rejects Ceasefire : అమెరికా సైతం.. Andhra Prabha News

  • కాల్పుల విరమణకు నో
  • రాజీ ప్రతిపాదనను ఆమోదించలేదు
  • వైట్​ హౌస్​ వెల్లడి

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

Us Rejects Ceasefire : అటు అమెరికా, ఇటు ఇరాన్​ … శాశ్వత యుద్ధ విరమణపైనే ఫోకస్​ పెట్టినట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీకి ముందే ఇరాన్ తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించి, యుద్ధానికి శాశ్వత ముగింపు కోరుతున్నట్లు తెలిపింది. కీలక మధ్యవర్తి పాకిస్థాన్ ద్వారా ఇరాన్​ తన స్పందనను తెలిపినట్టు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది. ఇరాన్ యుద్ధంలో 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా అధ్యయనం చేసిందని, ఇది ఒక “చాలా ముఖ్య అడుగు” అని సోమవారం (ఏప్రిల్ 6, 2026) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Us Rejects Ceasefire : ఇరాన్ ప్రతిపాదన ముఖ్యమైనదే కానీ సరిపోదని కూడా ఆయన అన్నారు. అంతక ముందు, ట్రంప్ ఆ ప్రతిపాదనపై “ఆమోదం తెలపలేదని” యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. . తాత్కాలిక కాల్పుల విరమణ”కు బదులుగా హోర్ముజ్ జలసంధిని తెరిచేది లేదని ఒక సీనియర్ ఇరాన్ అధికారి సోమవారం (ఏప్రిల్ 6, 2026) అన్నారు. శాశ్వత కాల్పుల విరమణకు వాషింగ్టన్‌ సంసిద్ధత లేదని ఇరాన్​ భావిస్తోందని ఆయన తెలిపారు. తక్షణ కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ స్వీకరించిందని, దానిని సమీక్షిస్తోందని ఆ అధికారి ధృవీకరించారు. గడువులను అంగీకరించి, నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయడాన్ని ఇరాన్​ అంగీకరించదని ఆయన తెలిపారు.

Us Rejects Ceasefire : ఇరాన్​ “ప్రభుత్వ లక్ష్యాలపై” దాడులు పూర్తి చేశామని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం (ఏప్రిల్ 6, 2026) తెలిపింది. ఈ దాడుల్లో కనీసం 25 మంది మరణించారు. హోర్ముజ్ జలసంధిని తప్పనిసరిగా తిరిగి తెరవాలని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించిన తర్వాత ఈ దాడి జరిగింది.

Leave a Reply