నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డ్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి సుజాత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరుగగా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు గాను 6వ వార్డు అభ్యర్థి అభ్యర్థిగా పోటీ చేసిన ఎరుకలి మహాదేవప్ప ఎన్నికలకు ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నికల సంఘం 6వ వార్డ ఎన్నికలు వాయిదా వేసింది.
దీంతో తిరిగి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నామినేషన్ దాఖలకు చివరి రోజైన సోమవారం బీజేపీ అభ్యర్థిగా దివంగత ఎరుకలి మహాదేవప్ప భార్య సుజాత బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 18న పోలింగ్ జరగనుంది .20 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.రాజశేఖర్ రెడ్డి ,నాయకులు లక్ష్మణ్, చందాపూర్ రాము కొండయ్య, నరసింహులు,అశోక్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
