ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం

ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం
నిర్మల్ టౌన్ ఏప్రిల్ 6 ఆంధ్రప్రభ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సమతా సుదర్శన్ నిర్మల్ లో ఎస్సీ సెల్ నాయకులు నాయుడు వాడలో ఘనంగా శాలువతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా సమతా సుదర్శన్ మాట్లాడుతూ ఎస్సీ కులస్తులు రాజకీయంగా వివిధ రంగాల్లో రాణించే విధంగా అందరూ సముష్టితో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని వాటి ఫలాల వివరాల ను ఇతరులకు తెలియజేయాలని సూచించారు. ఇందులో ఎస్సీ సెల్ నిర్మల్ జిల్లా నాయకులు కొంతం గణేష్. ఆకుల సాయి. రాజు తదితరులు ఉన్నారు.
