న్యాయం కోరుతూ యువతి ధర్నా..

న్యాయం కోరుతూ యువతి ధర్నా..
గూడూరు, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెం గ్రామ శివారు వాగ్య తండాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన ఓ యువతి గుండెం గ్రామ శివారు వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురాం అనే యువకుడిని గత ఏడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్లు తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపించింది.
పెళ్లి చేసుకోవాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు యువతి తెలిపింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సమాచారం అందుకున్న స్థానికులు, గ్రామ పెద్దలు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువురితో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే పోలీసుల జోక్యంతో చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
