కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధి.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఉపసర్పంచ్ఆర్. రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం. భరత్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని 14వ వార్డులో జీపీ నిధులతో కల్వర్టుపనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీడీకే అరుణ సహకారంతో ఊట్కూర్ మండల కేంద్రంలోని 16 వార్డులను అభివృద్ధి చేస్తామనిఅన్నారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగస్వాములై పట్టణాభివృద్ధికి ముందుకురావాలన్నారు.

పాతపేట ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద డ్రైనేజీ కల్వర్టు కూలిపోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిజిపినిధులతో పనులు చేపడుతున్నామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి విద్యుత్ సమస్య తలెత్తకుండా చూస్తామని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు మంజూరు చేసే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు సభ్యురాలు సువర్ణ రవికుమార్, మాజీ ఎంపిటిసిలు గోవిందప్ప, భీమమ్మ ఆశప్ప, మాజీ వార్డు సభ్యురాలు లక్ష్మీ తిరుపతి, కాలనీవాసులు రాము, ఆశప్ప, నరసింహ, అనిల్, నరేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply