కోనాపూర్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనాపూర్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ లిటరసీ అధికారులు విజయ్ కుమార్, కృష్ణవేణి, భూషణరావుపేట తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మక్సూద్ అలీ విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పాటించాలని,పాఠశాల దశ నుండే పొదుపు చేయడం పాటించాలని శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ ఆర్థిక అవసరాలపై స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీ కి రుణం తీసుకోకుండా బ్యాంకుల్లో రుణం తీసుకోవాలని తెలిపారు.

బ్యాంకులు ప్రజల అవసరాలకు విద్యా రుణం,బంగారు ఆభరణాల పై రుణం,గృహ నిర్మాణంపై రుణం,పంట రుణం లాంటి రుణాలు ఇస్తాయని తెలిపారు.గడువు తేదీ లోపల రుణం చెల్లిస్తే నిబంధనల మేరకు మాఫీ కూడా చేస్తారని తెలిపారు. పొదుపు చేసిన,సంపాదించిన డబ్బును సేవింగ్స్ ఖాతా,రికరింగ్ ఖాతా,ఫిక్స్డ్ డిపాజిట్ ల రూపంలో దాచుకోవచ్చని, ప్రతి విద్యార్థి బ్యాంకులో ఖాతా తీసుకొని ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాలని వివరించారు.

విద్యార్థులు తల్లిదండ్రు లు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని,తెలియని లింకుల ద్వారా వచ్చే మెసేజ్లను ఓపెన్ చేయవద్దని,ఆన్లైన్ మార్కెటింగ్ విధానంలో మోసపోవద్దని,సామాజిక మాధ్యమాల్లో మనకు తెలిసిన వ్యక్తుల లాగా నటిస్తూ మోసం చేస్తారని,మీకు లాటరీ వచ్చిందని మోసం చేస్తారు అని,వ్యక్తిగత వివరాలైన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు పిన్ ఎవరికి చెప్పవద్దని పాస్వర్డ్ లు తరచూ మార్చుకోవాలని తెలిపారు.బ్యాంక్ ఖాతా లేని విద్యార్థులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ భూషణరావుపేట శాఖలో ఉచితంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందజేశారు.విద్యార్థులందరికీ నోటుబుక్కులు,పెన్నులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్,ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply