గజవాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారు గజవాహనంపై గ్రామ పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గజవాహనంపై అలంకరించబడిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంగళ వాద్యాల నడుమ ఊరేగింపు ఘనంగా నిర్వహించగా, భక్తులు భక్తి శ్రద్ధలతో హారతులు పట్టి స్వామివారిని ప్రార్థించారు.
ఈ రోజు రాత్రి నుండి ప్రారంభం కానున్న స్వామి వారి రథోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అన్ని మౌళిక వసతులు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
