రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కామారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రైతులు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరకు కొనే విధంగా చర్యలు తీసుకుంటుందని, చెప్పారు.

రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజా రెడ్డి , సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తీ రమేష్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,అఖిలపక్ష నాయకులు, సీఈఓ చల్ల శంకర్, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply