అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత

అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత

పార్లమెంటు ఆమోదం హర్షనీయం
విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)
లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం కోసం విశేష కృషి
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు
ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు నెరవేరిన చారిత్రక ఘట్టమని ఎంపీ వ్యాఖ్య

విజయవాడ, ఆంధ్రప్రభ : పార్లమెంటు ఉభయ సభలలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం హర్షనీయం అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లు ఆమోదం ఐదు కోట్ల మంది ఆంధ్రులలో అపార ఆనందాన్ని నింపుతుందని ఎంపీ అన్నారు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆశలకు ఇది కీలక మలుపు అని పేర్కొన్నారు.

పార్లమెంటులో ఈ చారిత్రక బిల్లు ఆమోదానికి వచ్చే సమయంలో అమరావతి ప్రాంతానికి చెందిన విజయవాడ ఎంపీగా ఉండటం తనకు గర్వకారణమని కేశినేని శివనాధ్ తెలిపారు. ఇది తన ప్రజాసేవలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి రాజధాని చట్టబద్ధత సాధనలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం కీలకమైన అడుగుగా నిలుస్తుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.

Leave a Reply