కొలహాలంగా సానా సతీష్ కుమార్ నామినేషన్‌..

కొలహాలంగా సానా సతీష్ కుమార్ నామినేషన్‌..

ఆకుల రాఘవేంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
వేలాదిగా తరలివచ్చిన యువత, పార్టీ శ్రేణులు
అసెంబ్లీలో రాజ్యసభ నామినేషన్ దాఖలు
పసుపు జెండాలతో సందడిగా మారిన నగరం

విజయవాడ, ఆంధ్రప్రభ : రాజ్యసభ అభ్యర్థిగా సానా సతీష్ కుమార్ నామినేషన్ సందర్భంగా విజయవాడ నగరం సోమవారం టిడిపి శ్రేణుల నినాదాలతో మార్మోగింది. టిడిపి నాయకుడు ఆకుల రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో యువత, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన టిడిపి శ్రేణులు పసుపు జెండాలు, పార్టీ కండువాలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని తమ మద్దతును చాటుకున్నారు. నగర ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ విజయవంతంగా కొనసాగింది. అనంతరం అసెంబ్లీ ఆవరణకు చేరుకున్న సానా సతీష్ కుమార్ రాజ్యసభ సభ్యత్వానికి అధికారికంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నామినేషన్ కార్యక్రమం నేపథ్యంలో విజయవాడ నగరం మొత్తం పసుపు జెండాలు, పార్టీ నినాదాలతో సందడిగా మారగా, టిడిపి శ్రేణులు దీనిని పార్టీ ఐక్యతకు, బలానికి ప్రతీకగా అభివర్ణించాయి. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో ఈ నామినేషన్ కార్యక్రమం టిడిపి శక్తి ప్రదర్శనగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply