రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం శుభ పరిణామం….

రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం శుభ పరిణామం….

యార్లగడ్డ సుచిత్ర

విజయవాడ, ఆంధ్రప్రభ : జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగుమహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర మాట్లాడుతూ అమరావతి రాజధానిని ఎడారి, స్మశానంగా మార్చిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని, రాష్ట్ర ప్రజలతో మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి ప్రజలను అయోమయానికి గురి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పనిచేసిన ఘనత జగన్ రెడ్డి కె దక్కింది అన్నారు. దేవతల రాజధాని అయిన అమరావతిని జగన్ రెడ్డి హేళన చేస్తూ మావిగన్ అని సంబోధించడాన్ని చూసి యావత్ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి రాక్షస పాలనకు విసుగెత్తిన ప్రజలు 151 సీట్లు నుండి 11 సీట్లకి తీసుకువచ్చారని, జగన్ రెడ్డి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా అమరావతి రాజధానిపై విషం చిమ్ముతున్నాడని విమర్శించారు.

గత జగన్ రెడ్డి పాలనలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో యావత్ భారతదేశం చూసింది అన్నారు. మహిళా రైతుల పక్షాన మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రాజధానికి కట్టుబడి వారి పోరాటంలో భాగస్వామ్యం అయ్యామన్నారు. జగన్ రెడ్డి పెట్టిన ఇబ్బందులు ఇప్పటికీ మర్చిపోలేమన్నారు.జగన్ రెడ్డి లాంటి రాక్షసుడు పాలనకు చమర గీతం పాడడానికి అమరావతి రైతులు కీలక పాత్ర పోషించారు అన్నారు.

రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి వంటి రాక్షసుడు రాష్ట్ర ప్రజలను మోసం చేయకుండా, అమరావతి రాజధానిని కదిలించకుండా, అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతాన్ని నాశనం చేయకుండా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భంలో, ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని తీర్మానం చేయటం జరిగిందని, దానిని పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదించి, అంగీకారం తెలిపిందన్నారు. ఇది భారత దేశ చరిత్రలో ప్రప్రథమంగా ఒక రాష్ట్రానికి రాజధానిని నిర్దేశిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయడం చారిత్రాత్మకమని, ఈ ఘనత చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైందని అన్నారు. త్వరలో రాష్ట్రపతి ఆమోదముద్రతో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిగా నోటిఫై చేయడం జరుగుతుందని, అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజానీకం ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు.

అమరావతి రాజధాని సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారని, చంద్రబాబు గారు పడిన కష్టం శ్రమ ఈరోజు ఫలించిందని అన్నారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చట్టబద్దత బిల్లు ను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు వాకౌట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకుల అసలు రంగు బయటపడిందని,ఊసరవెల్లి సైతం ఉలిక్కిపడేలా జగన్ రెడ్డి నైజం ఉందని ఎద్దేవా చేశారు.ఇకముందు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీకి పుట్టగతులు ఉండవని సుచిత్ర హెచ్చరించారు.

Leave a Reply