No 3 Capitals : ఏపీకి అమరావతి కిరీటం Andhara Prabha SPL News

No 3 Capitals : ఏపీకి అమరావతి కిరీటం Andhara Prabha SPL News

  • పార్లమెంటు శాశ్వత తిలకం
  • ఇక అమరావతి శాశ్వత రాజధాని
  • లోక్‌సభ ఆమోదం
  • పార్లమెంటులో బిల్లుపై తీవ్ర చర్చ
  • చర్చలో 11 పార్టీలు.. 18 మంది ఎంనీలు
  • కూటమి వ్యూహం..
  • పెట్టుబడిదారులకు భరోసా
  • వైసీపీ వ్యతిరేకం..
  • సభ నుంచి వాకౌట్
  • జగన్ కే క్రెడిట్​ ..
  • రాజకీయ వేడి
  • 3 రాజధానుల వివాదానికి ముగింపు
  • ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్​ )

No 3 Capitals

ఏపీ రాజధాని అమరావతిని ఇక ఇంచి కూడా కదపలేరు. అమరావతి అరామరం. అజయం.. ఇదీ కూటమి సర్కారు సుప్రీం లీడర్​ నారా చంద్రబాబు నాయుడి ఉద్వేగ భరిత వ్యాఖ్య. ఏపీ ఏకైక రాజధాని అమరావతే నినాదం ప్రాణం నిలిచింది. ఏపీ శాశ్వత రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు 18 మంది ఎంపీలు పాల్గొంటే.. కేవలం ఒకే ఒక పార్టీ అదే వైసీపీ వ్యతిరేకించి వాకౌట్​ చేసింది. ఈ బిల్లు గురువారం పెద్దల సభలో చర్చకు రానుంది. ఇక్కడ కూడా లోక్​ సభలో సన్నివేశమే కనిపిస్తుంది.

No 3 Capitals : 1​ షాట్​ 2 బర్డ్స్​ వ్యూహం

No 3 Capitals

ఇక దేశ పార్లమెంటు చరిత్రలోనే తొలి సారిగా ఏపీ రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా లభించింది. ఇప్పటి వరకూ ఎన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడినా.. శాశ్వత రాజధాని అంశం పార్లమెంటులోకి అడుగుపెట్టలేదు. కానీ పునర్విభజన చట్టం సవరణ కోరతూ.. ఏపీ రాజధాని పార్లమెంటు తలుపు తట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే ప్పందించింది. ఏపీ ప్రభుత్వం తీర్మానించిన ఏపీకి శాశ్వత రాజధాని బిల్లును పార్లమెంటులో ఆగమేగాల మీద.. ఏ కగ్రీవంగా లోక్​ సభ ఆమోదం వ్యకం చేయటంపై .. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ రాజధానిపై అనిశ్చితి తొలగింపు ఒక అంశం కాగా…ఒక వేళ ప్రభుత్వం మారితే.. ,, మళ్లీ మూడు ముక్కలాట తెరమీదకు వస్తే.. అమరావతిలో పెట్టుబడులన్నీ కృష్ఱనది పాలు కావటం తథ్యం.

No 3 Capitals

పెట్టుబడి దారుల్లో విశ్వసనీయత పెంచటానికే.. కూటమి ప్రభుత్వం అమరావతికి ప్రాణప్రతిష్ట చేసింది. ఈ బిల్లును వ్యతిరేకించి ఏపీ ప్రజలకు వైసీపీ దూరమైనట్టే. ఇక్కడ వ్యక్తిగత రాజకీయ వ్యూహాల్లో వైసీపీ చిక్కింది. ఏపీకి శాశ్వత రాజధాని రావటం ఆయనకు ఎందుకు ఇష్టం లేదు. ఏపీని ఏమి చేయాలనుకుంటునాడు.. అనే స్వరం ఇప్పుడు పెరిగింది. పదేళ్లుగా రాజధాని లేదు. 5 ఏళ్ప జగన్​ పాలనలో అమరావతి పిచ్చి మొక్కలతో బిక్క చచ్చిపోయింది. ఏటా మూడు పంటలు పండే జరీబు నేలో గరీబుల సంఖ్య పెరిగింది. కనీసం భుక్తి కోసం పని దొరకని దుస్థితి ఏర్పడింది. నెలకో బటన్​ నొక్కి జనానికి జగన్​ పైసలు విసిరాడే గానీ.. అభివృద్ధి కోసం ఆలోచించలేదు.. అనేది ఏపీ జనం వాదన. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే.. మనమే గెలుస్తాం అని వైసీపీ అధినేత ఇంకా గంపెడాశతో ఉన్నారు. కానీ.. ఏపీ శాశ్వత రాజధాని అమరావతిని ఆమోదించలేక పోయారు. ఇప్పటికీ ఆయన అమరావి రాజధానిలో అవినీతికే వ్యతిరేకం అంటున్నారు. ఇక్కడ అవినీతి ని వదిలించుకోవటానికి రాష్ట్రం మొత్తం అవినీతి, అరాచకం, అక్రమాలను విస్తరిస్తారా? అనేది జనం ప్రశ్న.

No 3 Capitals : ఈ క్రెడిట్​ జగన్​ దే

No 3 Capitals

శ్రీ బాగ్​ ఒడంబడిక ప్రకారం, ఏపీ అభివృద్ధిని మూడు కేంద్రాలకు విస్తరించాలని ఆశించాం, అంతే గానీ అమరావతిని నిర్లక్ష్యం చేయలేదని .. ఈ రోజు పార్లమెంటులో ఏపీ శాశ్వత రాజధాని అమరావతి బిల్లుపై చర్చకు ముందే.. వైసీపీ అధినేత వైఎస్​ జగన్​ మీడియా ముందుకు వచ్చారు. తన కంఠఘోషను వినిపించారు. వైసీపీ ఎంపీలు ఏకంగా వాకౌట్​ చేశారు. కానీ.. ఏపీ శాశ్వత రాజధాని హోదా అమరావతికి దక్కటానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​.,, ప్రధాని మోదీ కృషిగా.. కూటమి శ్రేణులు.. ఏపీలో సంబరాలు చేస్తున్నారు. కానీ జగనే అమరావతి పనులు కొనసాగిస్తే.. శాశ్వత రాజధాని పదం వెలుగులోకి వచ్చేది కాదు. ఏపీకి ప్రతేక హోదా ఎలా దక్కలేదో.. రాజధాని అమరావతికి శాశ్వత హక్కు లభించేది కాదు. ఎనీ హౌ… జగన్​ ఆడిన త్రీ రీజియన్స్​ ఆట.. ఏపీకి ఒకే రాజధాని.. అదీ అమరావతే.. నినాదం పురుడు పోసుకుంది. పండండి బిడ్డను సీఎం చంద్రబాబు చేతిలో పెట్టింది. కానీ ఈ క్రెడిట్​ మొత్తం మాజీ సీఎం వైఎస్​ జగన్​ కే దక్కింది. ఇదీ … ఏపీ జనం అభిప్రాయం.

No 3 Capitals : పార్లమెంటు ప్రాణప్రతిష్ట ఇలా..

No 3 Capitals

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (సవరణ) బిల్లు-2026 ఆమోదం పొందింది. ఇక ఏపీ రాజధానిగమరావతికి అధికారికంగా చట్టబద్ధత కల్పించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్​ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2014 ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5(2) ను సవరిస్తూ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. .

No 3 Capitals

చట్టం ప్రకారం పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఉంటుంది” (there shall be a new capital) అని మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ సవరణతో ఆ స్థానంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది అని స్పష్టంగా చేర్చారు. ఈ చట్టం జూన్ 2, 2024 నుంచి అమలులోకి వచ్చినట్లుగా పరిగణిస్తారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు 18 మంది ఎంపీలు మాట్లాడారు. ఈ చట్టం సవరణ ఎందుకు జరుగుతుందో.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వివరించారు. ఏపీ రాజధాని విషయంలో గత కొన్నాళ్ల అనిశ్చితికి ఈ బిల్లుతో తెరపడిందని, ఏపీ అభివృద్ధికి అమరావతి కేంద్ర బిందువు అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మార్చి 28న ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని గౌరవిస్తూ ఈ చట్ట సవరణ చేసినట్లు వెల్లడించారు.

No 3 Capitals : ఈ చట్టానికి రైతుల కన్నీళ్లే.. పునాది

No 3 Capitals

అమరావతికి భూములిచ్చిన రైతుల త్యాగాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్​ కొనియాడారు. లోక్‌సభలో అమరావతి బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నట్లు తెలిపారు. అమరావతి రైతులకు, మహిళలకు కేంద్రమంత్రి అభినందనలు తెలియజేశారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు పై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని వెల్లడించారు. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని కేంద్ర మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలాన్ని వృథా చేసిందన్నారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిని వైసీపీ సృష్టించిందని మండిపడ్డారు. రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయన్నారు.

No 3 Capitals : 3 ముక్కలాట కుదరదు

No 3 Capitals

రాజధాని అంటే భవనం కాదు.. గౌరవం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రతి తెలుగువాడి గుండె చప్పుడని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు అమరావతిని నాశనం చేసేందుకు జగన్‌ ఎంతో ప్రయత్నించారు’.. ‘ఇకపై పులివెందుల ఎమ్మెల్యే అమరావతిలో మూడు ముక్కలాట ఆడలేరు.. ఇకపై ఊసరవెల్లిలా రంగులు మార్చలేరు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్‌ తన అరాచకం మొదలు పెట్టారు. ఐదేళ్లలో జగన్‌ అరాచకాన్ని ప్రజలు భరించలేకపోయారు. అని సీఎం రమేష్​ అన్నారు. ‘అమరావతి చట్టబద్ధతకు మోదీ, అమిత్‌షా, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్​ సహకరించారు. ఈ బిల్లు ఏపీకి అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తుంది. అని ఎంపీ రమేష్​ అన్నారు

No 3 Capitals : అమరావతే.. తొలి ప్రజారాజధాని

No 3 Capitals

వైసీపీ హయాంలో రాజధానిపై తీవ్ర అస్థిరత నెలకొందని.. రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరీ విమర్శించారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని ఎంపీ తెలిపారు. 29 వేలమంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని.. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్నారు వైసీపీ పాలనలో అమరావతి భవితవ్యం అంధకారంలో పడిందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఏపీలో అరాచక పాలన సాగిందని విమర్శలు గుప్పించారు. వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందన్నారు. అమరావతి కోసం రాజధాని రైతులు 1600 రోజులకు పైగా ఉద్యమించారని తెలిపారు. రాజధాని రైతులను అప్పటి ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించలేదన్న కాంగ్రెస్‌ విమర్శలు సరికాదన్నారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం హడ్కో నిధులు విడుదల చేసిందని ఎంపీ వివరించారు.

No 3 Capitals : ఈ బిల్లు వద్దు

No 3 Capitals

ఏపీ రాజధాని అమరావతి బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత స్థితిలో ఈ బిల్లుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని నిర్ణయమన్నది రాష్ట్ర ఇష్టమని.. గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్‌ ఇచ్చిందని తెలిపారు. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై మాట్లాడితే బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని అన్నారు.
‘అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లే ఖర్చు చేసింది. రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో బిల్లులో పెట్టాలి. రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?. 50 వేల ఎకరాలు ఉండగా.. మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. అదనపు భూసేకరణ ఎందుకు?. రాజధాని విషయంలో చంద్రబాబుకు స్పష్టత లేదు’ అని అన్నారు.

ALSO READ : ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News

Leave a Reply