ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న మంత్రి దుద్దిళ్ల

ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న మంత్రి దుద్దిళ్ల
మంథని, ఆంధ్రప్రభ : తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. బుధవారం మంథని మండలంలోని అక్కేపల్లి గ్రామానికి చెందిన సిద్ధం జ్యోతిర్మయి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. రెండు లక్షల 50 వేల రూపాయలు చెక్కు మంజూరు చేయించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఎల్వోసి చెక్కు మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబుకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
