నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి
- ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ కుమార్ విజ్ఞప్తి
- ఇంటింటా ప్రచారం చేపట్టిన అధ్యాపకులు
పరకాల, ఆంధ్రప్రభ : నాణ్యమైన విద్య కోసం విద్యార్థులు పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు పరకాల పరిసర గ్రామాలను, పట్టణంలోని వార్డు లను సందర్శిస్తూ కళాశాలలో గల వసతులు, ప్రస్తుత కోర్సులు, నూతన కోర్సులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు ఆధునిక సౌకర్యాల గురించి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలోనే చేరాలని ఇంటింటా ప్రచారాన్ని చేపడుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి సంతోష్ కుమార్ తెలిపారు.
ఇందులో భాగంగా అధ్యాపకులు నాలుగు బృందాలుగా ఏర్పడి పరకాల మున్సిపాలిటీ పరిధిలో గల ఆయా వార్డులను, పరకాల నియోజకవర్గ మండలాల గ్రామాలను సందర్శించి వార్డు కౌన్సిలర్స్. సర్పంచ్ లతో పాటు వార్డ్ లో గల విద్యార్థిని విద్యార్థులకు కళాశాల గురించి తెలియజేస్తూ ఇంటింటే ప్రచారం నిర్వహిస్తున్నారు. త్వరలోనే నూతన కళాశాల భవనం కూడా అందుబాటులోకి రానుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ కుమార్ తెలియజేశారు.
