వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు

మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య కోరారు. మంగళవారం 8 వ వార్డ్ అంగడి బజార్ లో లో వోల్టేజ్ నివారణకు నూతనంగా ఏర్పాటు చేసిన 100 కె వి ట్రాన్స్ఫార్మర్ ని చైర్మన్ స్వయంగా ప్రారంభించారు.

మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఏ డి ఈ బాలు నాయక్, ట్రాన్స్కో ఏ ఈ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, కౌన్సిలర్లు పన్నాల శ్రీ విద్య ,బీసు శ్రీకాంత్ గౌడ్,కారుపోతుల వెంకన్న గౌడ్,మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి,కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply