సింహ వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి..

సింహ వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి..
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సింహ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సింహ వాహనంపై అలంకరించి గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఊరేగింపులో గ్రామ ప్రజలు, మహిళలు హారతులు పట్టుకుని భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి శోభాయాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ వివిధ వాహన సేవలు నిర్వహిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ కమిటీ తెలిపారు.
