Peddapalli | నాణ్యమైన ఆహారం అందించాలి.. రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శ్యాం ప్రసాద్

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ప్ర‌భుత్వ‌ జాయింట్ సెక్రెటరీ శ్యాం ప్రసాద్ లాల్ ఆదేశించారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లాలోని సుల్తానాబాద్, పెద్దపల్లి బీసీ బాలుర వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

విద్యార్థులు వచ్చేనాటికి పూర్తిస్థాయిలో వసతులు ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. ప్రతి ఒక్కరికి సకాలంలో యూనిఫాం అందేలా చూడాలన్నారు. వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన వసతి అందించాలనే ఉద్దేశంతో మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహాలను ఏర్పాటు చేసిందన్నారు.

Leave a Reply