పట్టణ సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తాను

పట్టణ సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తాను
పెడన – ఆంధ్రప్రభ : పెడన పట్టణ సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. సోమవారం పట్టణంలోని 7వ వార్డు లోని మార్కెట్ యార్డ్ నుండి తులసి థియేటర్ వరకు రూ. 20 లక్షల అంచనాలతో నిర్మించనున్న డ్రైన్ శంఖుస్థాపన కూటమి నాయకులతో కలిసి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెడన పట్టణంలో ప్రజలు అనేక సమస్యలను ప్రస్తావించారు అని అన్నారు.
ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన అనేక సమస్యలు వస్తున్నాయని ఈ నేపథ్యంలో మున్సిపల్ పట్టణ అభివృద్ధి మంత్రివర్యులు పుంగనూరు నారాయణ గారు పెడన పర్యటన సందర్భంగా పెడన పరిస్థితులను వివరించుట జరిగిందని అన్నారు. వెంటనే మంత్రిగారు స్పందించి అప్పటికప్పుడు రూ 2 కోట్ల మంజూరు చేశారని తెలిపారు.

అలాగే ఎస్.సి కమ్యూనిటీ హాల్ కోసం రూ .20 లక్షలు విడుదల చేశారని త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభం అవుతాయని కాగిత కృష్ణ ప్రసాద్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
