చిన్నారిని చిదిమేసిన లారి..

నస్పూర్, ఆంధ్రప్రభ ; అభం శుభం తెలియని తొమ్మిది నెలల పసిపాపని బూడిదలారి తొక్కేసిన దుర్ఘటన నస్పూర్ పట్టణంలోని సీతారాంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి సమీపంలోనే పెద్దబూదె నుండి పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వచ్చిన దంపతులు లింగంపల్లి మౌనిక, రాజుల రెండో కూతురు 9 నెలల పసిపాప లక్కీని బ్రిక్స్ లో ఉపయోగించే ప్లై యాస్ తీసుకువచ్చిన లారీ డ్రైవర్ గమనించకపోవడంతో అక్కడే ఆడుకుంటున్న చిన్నారి పాప లారీ రివర్స్ చేసుకున్న సమయంలో చక్రాల కింద పడింది లారీ డ్రైవర్ గమనించక పాపపై బూడిదను డంపింగ్ చేయడంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
