రఘునాథపల్లిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : సమాజమే దేవాలయం.. ప్రజల నా దేవుళ్ళు నినాదంతో యుగ పురుషుడు నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన టీడీపీ పార్టీ 44 వసంతాల సందర్భంగా ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రఘునాథపల్లి మండలకేంద్రంలోని బస్టాండ్ ప్రాగాణంలో ఆపార్టీ మండల అధ్యక్షులు బొక్క రామచంద్రయ్య (చంద్రబాబు) ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎడ్ల మల్లేశం, ఎండి జహింగీర్, ఉమ్మగొని నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొంగరి నర్సింగరావు, మండల నాయకులు గండికోట యాదగిరి, మాస శివశంకర్, తుడి ఉమేష్, చాతర్ల రవి, ఎండి సికిందర్, కాదనూరి మధుసూదన్, పన్నాల శ్రీనివాస్, పిన్నింటి మల్లారెడ్డి, పన్నాల వెంకటరమణ, జేరిపోతుల రవీందర్, మచ్చ మధు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply