Adivi sesh | గ్లామర్ తో షాక్ ఇచ్చిన జోనితా

Adivi sesh | గ్లామర్ తో షాక్ ఇచ్చిన జోనితా
Adivi sesh | జోనితా గాంధీ గ్లామర్ షోతో సర్ప్రైజ్
‘చిచ్చు బుడ్డి’ పాటతో యూట్యూబ్‌లో ట్రెండ్
సింగర్ నుంచి గ్లామర్ ఐకాన్‌గా జోనితా
అడివి శేష్ ‘డెకాయిట్’ పై భారీ అంచనాలు
శృతి హాసన్ ఔట్.. మృణాల్ ఎంట్రీ
హిట్ కోసం ఎదురుచూస్తున్న మృణాల్
ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు డెకాయిట్
Adivi sesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జోనితా గాంధీ.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ (Director) అనిరుథ్ తో కలిసి పలు పాటలు పాడి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ మూవీ కోసం ఓ పాట పాడింది. అంతే కాకుండా.. ఫస్ట్ టైమ్ పాటలో తన అందచందాలతో షాక్ ఇచ్చింది. చిచ్చు బుడ్డి అంటూ సాగే ఈ పాటను రామ్ మిరియాలతో పాటు జోనితా గాంధీ పాడింది. అయితే.. ఇప్పటి వరుకు జోనితా గాంధీ సింగర్ గా మాత్రమే తెలుసు.. ఇప్పుడు ఐటం సాంగ్ లో అందంతోనూ ఆకట్టుకోవడం విశేషం. ఈ సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే యూట్యూబ్ లో దూసుకెళుతుంది.

అడవి శేష్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో ముందుగా కథానాయికగా శృతి హాసన్ ని తీసుకున్నాడు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. శృతి ఈ సినిమా (Movie) నుంచి తప్పుకుంది. అప్పుడు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ని తీసుకున్నారు. అడివి శేష్ కి మాత్రమే కాదు.. మృణాల్ కి కూడా ఈ సినిమా సక్సెస్ అవసరం. ఎందుకుంటే.. మృణాల్ నటించిన ఫ్యామిలీ స్టోరీ ఫ్లాప్ అవ్వడంతో టాలీవుడ్ లో అమ్మడికి ఆఫర్స్ తగ్గాయి. దీంతో ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలి అనుకుంటుంది. ఈ డిఫరెంట్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.


