నిత్య అన్నదాన పథకానికి విరాళం…

నిత్య అన్నదాన పథకానికి విరాళం…
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు నిత్యాన్న దాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.
ఈ నేపథ్యంలో శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంకు ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన సముద్రాల వీరభద్రరావు, శ్రీలత దంపతులు నిత్య అన్నదాన పథకానికి రూ. 1,11,116/- విరాళాన్ని సమర్పించారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం ప్రధాని సూపర్డెంట్ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.
