Assembly | సభ ఏకగ్రీవ ఆమోదం…

Assembly | సభ ఏకగ్రీవ ఆమోదం…
Assembly | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుపై అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెట్రో స్వాధీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ మెట్రో నిర్వహణను ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మెట్రో విస్తరణకు ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులు దానిని ఆమోదించారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లేలా మెట్రోను అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడలేదని, ప్రతిపక్ష అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని విమర్శించారు. సభలో సరైన చర్చ లేకుండా తీర్మానాన్ని ఆమోదించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు.
