Farmers | విద్యుత్ శాఖ నిర్లక్ష్యం..

Farmers | విద్యుత్ శాఖ నిర్లక్ష్యం..
ప్రాణాలపై వేలాడుతున్న కరెంట్ స్తంభాలు…!
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది
కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మూడు స్తంభాలు
ప్రాణాలను పణంగా పెట్టుకుని పంట పనుల్లో రైతులు
బిల్లుల కోసం ఇంటింటికీ వచ్చే అధికారులకు సమస్యలపై నిర్లక్ష్యమెందుకు?
బోయినిగూడెం రహదారిపై వెళ్తున్న వారికి స్పష్టంగా కనిపిస్తున్న ప్రమాదం
ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?లేక ముందే చర్యలు తీసుకుం టారా..?
Farmers | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని కోమటి గూడెం గ్రామ పరిధిలోని బోయిని గూడెంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరోసారి బహిరంగంగా బయటపడింది. పంట పొలాల మధ్యలో ఉన్న కరెంట్ స్తంభాలు ఒక్కటి కాదు…రెండు కాదు…మూడు స్తంభాలు ప్రమాదకరంగా వంగి ఎప్పుడై నా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రైతులు రోజూ ప్రాణాలను పణంగా పెట్టుకుని వ్యవసాయ పనులు నిర్వహించాల్సిన పరిస్థితి నెల కొంది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి యంత్రాలు ఉపయోగించే సమయం లో ఈ స్తంభాలు కూలిపోతే తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉంద ని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, గాలులతో పరిస్థితి మరింత విషమంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యం గా బోయినిగూడెం రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఈ ప్రమాదక ర పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇప్ప టికీ స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ప్రాణ భద్రత విషయంలో నిర్లక్ష్యమెందుకు..?
రైతుల ప్రాణ భద్రత విషయంలో ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఉన్నప్ప టికీ సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. బిల్లులు కట్టకపోతే వెంటనే అధికారులు కరెం ట్ కట్ చేస్తారు. కానీ మా ప్రాణాలకు ముప్పుగా ఉన్న స్తంభాలను సరిచే యడానికి మాత్రం ఎవ్వరూ రావడం లేదు అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ప్రమాదకర కరెంట్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పా టు చేయాలి. లేకపోతే ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత స్పందిస్తారా..?లేక ముందుగానే చర్యలు తీసుకుంటారా..?అన్నది ఇప్పుడు సంబంధిత విద్యుత్ శాఖకు పెద్ద పరీక్షగా మారింది.
