ఆలయాల అభివృద్ధికి వెదిరె బ్రదర్స్ లక్ష విరాళం

ఆలయాల అభివృద్ధికి వెదిరె బ్రదర్స్ లక్ష విరాళం

మునుగోడు, ఆంధ్రప్రభ : శ్రీరామ నవమి సందర్భంగా కొంపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం, తూర్పుగూడెంలోని శ్రీరాములవారి ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవాలలో వెదిరె బ్రదర్స్ తమ సేవాభావాన్ని చాటుకున్నారు. వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి,వెదిరె విజేందర్ రెడ్డి కలిసి ఒక్కోక్క ఆలయానికి రూ.50,000 చొప్పున మొత్తం రూ.1,00,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు దాతలను అభినందించారు.
ఈ విరాళం ద్వారా ఆలయాల అభివృద్ధికి సహకారం లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply