Gas cylinder | బస్సులో గ్యాస్ సిలిండర్ లభ్యం.. అనుమానాలు

Gas cylinder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన బస్సులో గ్యాస్ సిలిండర్ బయటపడటం కలకలం రేపుతోంది.

Gas cylinder

మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది.

ప్రమాదం అనంతరం పోలీసులు బస్సును తనిఖీ చేయగా ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ లభ్యమైంది. అయితే ఈ సిలిండర్ పేలిందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు.

Gas cylinder

సిలిండర్ ఆకారం పరిశీలిస్తే మంటల్లో కాలిపోయి నల్లగా మారినట్లే ఉందని, పేలిన ఆనవాళ్లు కనిపించడం లేదని వెల్లడించారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Leave a Reply