Alireza Tangsiri | ఇజ్రాయెల్ ప్రకటనతో ఉత్కంఠ..

Alireza Tangsiri | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ఇరాన్ నేవీ చీఫ్ అలిరెజా తంగ్సిరీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ వెల్లడించడం సంచలనంగా మారింది. హర్మూజ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఆయన మరణించారని పేర్కొంది.

ఇజ్రాయెల్ వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ నేవీకి చెందిన కీలక అధికారి అలిరెజా తంగ్సిరీ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఆయన ఇరాన్ సైన్యంలో అనుభవం కలిగిన కమాండర్‌గా పేరుగాంచారు.

2018 నుంచి నేవీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న తంగ్సిరీ, హర్మూజ్ జలసంధి మూసివేతలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అయితే ఈ వార్తపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ అంశంపై అనిశ్చితి కొనసాగుతోంది.

Leave a Reply