చిన్నారి ప్రసన్నకి ఆర్థిక సాయం

చిన్నారి ప్రసన్నకి ఆర్థిక సాయం
మద్దూర్, ఆంధ్రప్రభ : రెక్కడితేకానీ కడుపు నిండని ఆ నీరు పేద కుటుంబానికి చెందిన చిన్నారి ప్రసన్న తలసేమియా అనే వ్యాధితో అనారోగ్యం భారిన పడిన చిన్నారి కుటుంబం ఆపన్నహస్తం హస్తం కోసం ఎదురుచూస్తుంది. మద్దూర్ మండల పరిధిలోని చెన్నరెడ్డి పల్లి గ్రామానికి చెందిన హన్మంత్ అనిత అనే దంపతులకు ముగ్గురు పిల్లలు.వారి కుటుంబం వ్యవసాయం చేస్తూ కుటుంబ పోషణ చేస్తున్నారు. ఈ దంపతులకు రెండో కూతురు ప్రసన్న గీతాంజలి పాఠశాలలో ఎల్ కె జీ చదువుతుంది.
కష్టాల్లో ఉన్నఈ కుటుంబానికి గీతాంజలి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరు కలసి 1,02,682 రూపాయలు ఆర్థికసాయం చేశారు. చిన్నారి అనారోగ్య సమస్య తీరాలంటే ముప్పై లక్షల పైన ఖర్చు అవుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ పాప తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేక పోవడంతో చిన్నారి చికిత్సకు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నరు.చిన్నారికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

