మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం…

మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం…
13 మంది సజీవ దహనమయ్యారన్న వార్థ దిగ్భ్రాంతికి గురి చేసింది
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మార్కాపురం జిల్లా రాయవరంలో ట్రావెల్స్ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సుమారు 13 మంది సజీవ దహనమయ్యారన్న వార్త కలచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.
గాయాలపాలైన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని, దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తూ.. బాధిత కుటుంబాలకు మనో ధైర్యం కలగాలని కోరుకుంటున్నా అన్నారు. బాధితుల వివరాలు తక్షణమే సేకరించి వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అండగా నిలవాలని, ప్రయాణ సమయంలో భద్రతా నిబంధనలను అధికారులు పర్యవేక్షించాలన్నారు.
