Dhammaiguda | పొదల్లో మహిళ మృతదేహం..

Dhammaiguda | పొదల్లో మహిళ మృతదేహం..
- ఆధారాల కోసం గాలింపు
Dhammaiguda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమ్మాయిగూడలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళను హత్య చేసి, మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికులు అనుమానాస్పదంగా కనిపించిన మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం వద్ద స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
