26marcheditorial | 15 షరతులు, యుద్ధం కొనసాగింపుపై అనిశ్చితి

26marcheditorial | 15 షరతులు, యుద్ధం కొనసాగింపుపై అనిశ్చితి

26marcheditorial | అమెరికా విధించిన 15 షరతులు ఏమిటి?
ఇరాన్ ఎందుకు అంగీకరించడం లేదు?
హార్మూజ్ జలసంధి, ప్రపంచ సంక్షోభ భయం
ఇజ్రాయెల్-అమెరికా మధ్య విభేదాలు
యుద్ధం వెనుక రాజకీయ వ్యూహాలు

26marcheditorial ఇరాన్ తో యుద్ధాన్ని విరమించేందుకు అమెరికా 15 షరతులను విధించింది. అయితే, వీటిని ఇరాన్ అంగీకరించడం లేదు. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు అప్పగించాలన్నది అమెరికా ప్రధానమైన డిమాండ్. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న డిమాండ్ కూడా ముఖ్యమైనది. ఇరాన్ క్షిపణి కార్యక్రమాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. మొత్తం మీద అమెరికా ప్రతిపాదించిన 15 డిమాండ్లకు ఇరాన్ అంగీకరించడం లేదు. ప్రతిగా ఇరాన్ కూడా కొన్ని డిమాండ్లను చేసింది. ఇరు పక్షాల మధ్య చర్చలకు పాకిస్తాన్ ఆతిధ్యమిచ్చేందుకు అంగీకరించగా, అందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అయితే, ఇరాన్ ను పూర్తిగా అణు నిరాయుధీకరించేందుకు ప్రతిపాదించిన ఈ షరతులను అంగీకరిస్తే ఇరాన్ పూర్తిగా లొంగిపోయినట్టే. అందువల్ల యుద్ధ విరమణ అనేది జరిగేది కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

26marcheditorial
26marcheditorial

ఇరాన్ తన వాదాన్ని హర్మూజ్ జల సంధి పై ప్రధానంగా వినిపిస్తోంది. ఈ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తే, ప్రపంచంలో చమురు సంక్షోభం ఏర్పడవచ్చు. అంతేకాక, ఎరువుల కొరత తద్వారా ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించడానికి ట్రంప్ని ఒప్పించిన ముఖ్యకారణాలు ఇవి. అంతేకాక, ఇరాన్ ఓటమిని శాంతి ఒప్పందంగా పిలవద్దన్న షరతును కూడా అమెరికా విధించింది. అన్నింటికన్నా ముఖ్యమైనది అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధాన్ని సాగించింది. అంటే, యుద్ధానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా సమష్టి నిర్ణయం అయి ఉండాలి. కానీ, ఇజ్రాయెల్కి తెలియకుండా అమెరికా ఇరాను ఈ 15 షరతులను విధించడం ఇజ్రాయెలికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అందువల్ల అమెరికాతో ఇజ్రాయెల్ ఏకీభవించడం లేదన్న విషయం స్పష్టం అవుతోంది. యుద్ధానికి ప్రేరణ అయిన ఇరాన్, యుద్ధానికి కాలుదువ్విన ఇజ్రాయెల్లు రెండు దేశాలూ కూడా అమెరికా ప్రతిపాదించిన షరతులకు అంగీకరించడం లేదు. ఇజ్రాయెల్కూ, అటు ఇరాన్కూ రెండు దేశాలకూ ఇది ప్రతిష్టాత్మకమే.

ఈ షరతులకు ఇరాన్ అంగీకరించదన్న విషయం అమెరికాకూ తెలుసు. ప్రపంచం దృష్టిలో తాను యుద్ధ విరమణకు సిద్ధమేనని ప్రకటించుకోవడం కోసం అమెరికా ఈ షరతులను బహిర్గతం చేసింది. నిజానికి ఇరాన్ తన వద్ద ఉన్న అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం అనేది జరిగేది కాదు. అందుకు ఏ దేశమూ కూడా అంగీకరించదు. ప్రపంచం మొత్తం మీద ఏకైక అణు సామర్థ్యం గల దేశంగా అమెరికాయే ఉండాలన్నది అమెరికా ట్రంప్ వాంఛ. తమది అగ్రరాజ్యం కనుక, ప్రపంచంలోని అన్ని దేశాలు తాము చెప్పినట్టు వినాలన్నది ఆయన వాదన. ఇందుకు ఇరాన్ ఒప్పుకోకపోవడం వల్లనే యుద్ధం వచ్చింది. దీనిని బట్టి యుద్ధకారకులు ఎవరో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదు. ట్రంప్ కోరుకుంటున్నది ప్రజాస్వామ్యం కాదు, నిరంకుశత్వమే. యుద్ధాన్ని ఎవరు ప్రేరేపించారో, ఎందుకు ప్రేరేపించారో స్పష్టమవుతోంది.

click here for more

click here to read prabhanews.com

Leave a Reply