మూడేళ్లుగా ప్రేమ… పెళ్లికి నిరాకరణ

మూడేళ్లుగా ప్రేమ… పెళ్లికి నిరాకరణ
- ప్రేమ పేరుతో మోసపోయిన యువతి
- పోలీసులను ఆశ్రయించిన యువతి కుటుంబ సభ్యులు.
- యువకుడిపై ఫోక్సో కేసు నమోదు.
ఊట్కూర్, ఆంధ్ర ప్రభ : ప్రేమ పేరుతో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని (19 ) యువతితో మూడేళ్లపాటు ప్రేమాయణం కొనసాగించి యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా పెళ్లికి నిరాకరించిన యువకుడిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథనం ప్రకారం… నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామానికి చెందిన బి. శ్రీకాంత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి తో గత మూడేళ్లుగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గత 15 రోజుల క్రితం యువతి పెళ్లి చేసుకోవాలని యువకుడి ఇంటికి వెళ్లి నిలదీయగా పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.
దీంతో ఇరు కుటుంబాల మధ్య మాట మాట పెరిగి పెళ్లి చేసుకోవాలని కోరగా యువకుడు నిరాకరించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడగా, కుటుంబ సభ్యులు ఆమెను నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ వివరించారు.
