self intro to god | పూజలో సంకల్పం ప్రాధాన్యం.. పూర్తి వివరణ

self intro to god | పూజలో సంకల్పం ప్రాధాన్యం.. పూర్తి వివరణ

self intro to god | సంకల్పం అంటే ఏమిటి?
సంకల్పంలోని ప్రతి పదానికి అర్థాలు
కాలం, స్థలం, వ్యక్తిగత వివరాల విశ్లేషణ
సంకల్పం లేకుండా పూజ ఫలితమేమిటి?
భక్తి vs నియమ నిష్టలు

self intro to god | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సంకల్పం చెప్పుకోకుండా పూజ చేస్తే..? చాలామందిని వేధించే ప్రశ్న ఇది. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడి అర్చకులు మన గోత్ర నామాలన్నీ అడిగి, సంకల్పం చెప్పి అర్చన చేయిస్తారు. మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అందుబాటులో ఉన్న దీపారాధన చేయడం, అగరొత్తులు వెలిగించడం, పూలు, పసుపు, కుంకుమ ఇంకా సుగంధ ద్రవ్యాలు సమర్పిస్తూ స్తోత్రాలను చదువుకోవడం, అవి పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి, హారతి ఇచ్చి, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం…ఇదే మన పూజ.

మరి ఆలయాల్లో అర్చకులు ఆచరించినట్లుగా ముందు మన సంకల్పంతో ప్రారంభించి, ప్రతి పూజా విధానానికీ ఒక శ్లోకం, మంత్రం చెబుతూ చేసుకోలేం కదా? ఇలాంటి పూజ ఫలాన్నిస్తుందా అని ఒక సందేహం ఎన్నోసార్లు కలుగుతుంది.

అసలు సంకల్పం అంటే ఏమిటో చాలామందికి తెలియదు.
ఒక ఆలయంలో మూల విరాట్టుని అర్చించేప్పుడు, మన గురించి మనం తెలియజేసుకునే వివరాలే సంకల్పం. అంటే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి మనం ఎలాగైతే తెలియజేసుకుని పరిచయం చేసుకుంటామో, భగవంతుడికీ మన గురించి ఆలయ అర్చకుల ద్వారా తెలియజేసుకునే వివరాలే అన్నమాట. సంకల్పంలో ఒక్కో పదానికీ ఒక్కో అర్థముంది. అవేమిటో చూద్దం.

పూజల్లో చెప్పుకునే సంకల్పం అనేది చాలా విశాలమైనది. ఇందులో కాలం, స్థలం, మన వ్యక్తిగత వివరాలు, పూజ ఉద్దేశ్యం అన్నీ ఉంటాయి.

మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం…

ఇప్పుడు దీనిలోని ప్రతి పదానికి అర్థాలు చూద్దాం

self intro to god
self intro to god

మమ = నా / నాకు సంబంధించిన
ఉపాత్త = పొందిన / సేకరించిన
సమస్త = సమస్త / అన్నీ
దురిత = పాపాలు / చెడు కర్మలు
క్షయ = నాశనం / తొలగింపు
ద్వారా = ద్వారా / కారణంగా

మొత్తం భావం:
“నేను చేసిన సమస్త పాపాలు నశించడానికి

శ్రీ = శుభం / మంగళం
పరమేశ్వర = పరమాత్మ / భగవంతుడు
ప్రీత్యర్థం = సంతోషం కోసం / ప్రసన్నత కోసం

మొత్తం భావం:
“భగవంతుని సంతోషం కోసం

కాలానికి సంబంధించిన పదాలు
అద్య = ఈ రోజు
బ్రహ్మణః ద్వితీయపరార్థే = బ్రహ్మ దేవుని జీవితంలో రెండో భాగంలో
శ్వేతవరాహ కల్పే = శ్వేత వరాహ అవతార కాలంలో
వైవస్వత మన్వంతరే = వైవస్వత మనువు కాలంలో
కలియుగే = కలియుగంలో
ప్రథమ పాదే = మొదటి భాగంలో

స్థలానికి సంబంధించిన పదాలు
జంబుద్వీపే = భూమిలోని ఒక ద్వీపం(భారతదేశం ఉన్న ప్రాంతం)
భారతవర్షే = భారత దేశంలో
భారతఖండే = భారత భూభాగంలో
(మీ ప్రాంతం పేరు)
ఉదాహరణకు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు
అస్మత్ గోత్రః = మన గోత్రం
అముకనామధేయః = మన పేరు

ఉద్దేశ్యం
శ్రీ దేవతా ప్రీత్యర్థం = ఆ దేవత సంతోషం కోసం
పూజాం కరిష్యే = పూజ చేస్తాను

ఈవిధంగా అందరూ చదువుకోవాలని గానీ, సంకల్పం చెప్పుకునే పూజ చేసుకోవాలని గానీ ఏమీ లేదు. నిజమైన భక్తి, ఏకాగ్రతతో ఒక్కనిముషం కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ప్రార్థించినా అనుగ్రహిస్తాడు. కానీ, మన పెద్దలు చెప్పినట్లు, గురువులు ఉపదేశించినట్లు నియమ నిష్టలతో ఆచరిస్తే మన పూజలకు పరిపూర్ణత చేకూరుతుందని తరతరాల విశ్వాసం.

click here to more devotional articles

click here to read భక్తిప్రభ

Leave a Reply