ప్రవేశ పరీక్షల్లో పాఠశాల విద్యార్థుల సత్తా..

ప్రవేశ పరీక్షల్లో పాఠశాల విద్యార్థుల సత్తా..

11 మంది ఎంపికైన అభినందిస్తున్న సర్పంచ్, ఉపాధ్యాయలు,

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని పల్లికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభచాటారు. ఒకే పాఠశాల నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానో పాధ్యాయుడు మల్లేష్ మీడియా ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు పాఠశాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పిండి మనుష (అశోక్) హాజరై, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని ప్రధానోపాధ్యాయుడు కొనియాడారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ స్థాయి విద్యార్థులు పట్టుదలతో చదివి గురుకుల పరీక్షల్లో ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు.రాబోయే రోజుల్లో మరింత కృషి చేసి తల్లిదండ్రులకు, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు వడ్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ ఎన్నుపోతుల చిన్న బాలయ్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని ఎంపికైన వారికి అభినందనలు తెలిపారు.

Leave a Reply