anusha-project | శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం…

anusha-project | శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం…

అనూష ప్రాజెక్ట్స్ నిర్వాణలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు
మహిళలకు కోలాటం పోటీలు, ప్రథమ బహుమతి 30 వేల రూపాయలు

anusha-project | అచ్చంపేట, ఆంధ్రప్రభ : భక్తి, భవ్యత, సాంప్రదాయాల నడుమ అమ్రాబాద్ మండలం, మాచారం గ్రామంలో అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో అండపల్లి జలంధర్ రెడ్డి కుటుంబ సభ్యుల నిర్వహణలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మాచారం గ్రామంలో అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మించిన శ్రీ శ్రీశ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవస్థానంలో మార్చి 25 నుంచి 27వరకు ఈ మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. దేవస్థానం పరిధిలోని భక్తులు, గ్రామస్తులు కలిసి ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. పూల తోరణాలు, విద్యుద్దీపాలతో దేవాలయం కళకళలాడుతోంది. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కళ్యాణోత్సవం ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

కార్యక్రమాల వివరాలు…

మార్చి 25న సాయంత్రం 4.30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం పూజా కార్యక్రమాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. మార్చి 26న ఉదయం సుప్రభాతం, అభిషేకం, అలంకరణలతో పాటు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరుగుతుంది. మార్చి 27న ఉదయం 10 గంటలకు ప్రధాన ఘట్టమైన శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించబడుతుంది.

anusha-project | భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు…

కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం అన్నదానం, తాగునీరు, పార్కింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించనున్నారు.

anusha-project | పోటీలు, బహుమతులు…

ఈ సందర్భంగా మహిళలకు, యువతకు కోలాటం మరియు అడుగుల భజన పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు అండపల్లి కుటుంబ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతి రూ.30,000, రెండో బహుమతి రూ.20,000, మూడో బహుమతి రూ.10,000గా నిర్ణయించారు. అలాగే గ్రామీణ స్థాయి నుండి వచ్చిన కోలాటం బృందాలలో మంచి ప్రదర్శన కనబరిచిన టీం సభ్యులకు ప్రత్యేక బహుమతి ఇవ్వడానికి నిర్ణయించారు.

నిర్వాహకుల పిలుపు…

ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి పరిసర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి అండపల్లి కుటుంబ సభ్యులు కోరారు. శాంతి, భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు.

CLICK HERE TO READ MORE : Arunachalam | పంచభూత లింగాలలో అగ్ని లింగ క్షేత్రం

CLICK HERE TO READ MORE

Leave a Reply