Power star | ఆలోచన మారిందా..?

Power star | ఆలోచన మారిందా..?

Power star | ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి?
సురేందర్ రెడ్డి సినిమాకు గ్రీన్ సిగ్నల్
దేవ కట్టా సినిమా పై వచ్చిన ప్రచారం
హరీష్ శంకర్ మరోసారి పవన్‌తో సినిమా అంటారా?
పవన్ టీమ్ క్లారిటీ – కొత్త ప్రాజెక్టులపై సందేహాలు
పవర్ స్టార్ నెక్స్ట్ మూవీపై ఇండస్ట్రీలో ఆసక్తి

Power star | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ (Powerstar) ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఇద్దరు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆ ఇద్దరు దర్శకులకు పవన్ షాక్ ఇచ్చారు. ఇంతకీ.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు..? అసలు ఏం జరిగింది..?

Power star

Power star | పవన్, సురేందర్ రెడ్డి సినిమా..

పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రిలీజ్ (Release) అయ్యాయి. మరి.. నెక్ట్స్ ఏంటి అంటే.. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయాలి. ఈ డైరెక్టర్ తో సినిమా అని పవర్ స్టార్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ఓకే చెప్పారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమా స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్.. దేవ కట్టాతో సినిమా చేయడానికి ఓకే చెప్పారని.. ఇది మంచి కథాబలం ఉన్న సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది.

Power star

Power star | క్లారిటీ ఇచ్చిన పవన్ టీమ్..

ఇదిలా ఉంటే.. హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేస్తానని.. ఈసారి పవన్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు.. అందర్నీ ఆకట్టుకునే కథతో చేస్తానని అన్నారు. ఇలా పవన్ (Pavan) దేవ కట్టా సినిమా, పవన్ హరీష్ శంకర్ సినిమా, అలాగే పవన్, మోహన్ రాజా సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో పవన్ నిజంగానే ఈ ప్రాజెక్టులకు ఓకే చెప్పారా..? లేక గాసిప్పా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు పవర్ స్టార్ టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. కొత్తగా ఏ సినిమాకి ఓకే చెప్పలేదని.. ఏదైనా ఉంటే.. అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు. ఇలా క్లారిటీ ఇచ్చి.. దేవ కట్టా, హరీష్ శంకర్, మోహన్ రాజాలకు షాక్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి.. పవర్ స్టార్ కొత్తగా ఏ డైరెక్టర్ కి ఓకే చెబుతారో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Power star

Leave a Reply