Atrocious | భార్య, ప్రియుడిని కాల్చి చంపిన భర్త

Atrocious | భార్య, ప్రియుడిని కాల్చి చంపిన భర్త

Atrocious |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ విభేదాలు, అనుమానాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా భయాందోళనలకు దారితీసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గత అర్ధరాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. భార్య, ఆమె ప్రియుడిని భర్తే కాల్చి చంపినట్లు సమాచారం. ముగ్గురూ కలిసి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగి, ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కోపోద్రిక్తుడైన భర్త తుపాకీతో కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.