Aditya dhar | అసలు ప్లాన్ ఏంటి..?
Aditya dhar | అసలు ప్లాన్ ఏంటి..?
Aditya dhar | ధురంధర్ 2 విజయంతో ఆదిత్య ధర్ క్రేజ్ పెరిగింది
ఎన్టీఆర్, బన్నీ కాంబినేషన్ పై ఊహాగానాలు
నిర్మాతగా టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాడా?
రామ్ గోపాల్ వర్మతో గ్యాంగ్ స్టర్ సినిమా చర్చలు
అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు
Aditya dhar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సినీ అభిమానులు అందరూ ధురంధర్ 2, ఈ మూవీని తీసిన డైరెక్టర్ ఆదిత్య ధర్.. గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా అంచనాలకు మించిన కలెక్షన్స్ రాబడుతుంది. దీంతో ఆదిత్య ధర్ నెక్ట్స్ మూవీ ఏంటి అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. అయితే.. ఆదిత్య ధర్ తెలుగులో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుండడం విశేషం. ఇంతకీ.. తెలుగులో ఎవరితో సినిమా చేయబోతున్నాడు..? ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ప్లాన్ ఏంటి..?
Aditya dhar | ఎన్టీఆర్, బన్నీ కాంబో..?

ఆదిత్య ధర్ ఇప్పుడు సౌత్ పై ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, బన్నీ కాంబినేషన్లో సినిమా చేయాలి అనుకున్నాడని ప్రచారం జరగడం తెలిసిందే. బన్నీ, తారక్ సోషల్ మీడియాలో ధురంధర్ 2 గురించి స్పందించడంతో ఈ కాంబో ఫిక్స్ అంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే.. ఆదిత్య ధర్ నెక్ట్స్ సినిమా గురించి ఇప్పటి వరుకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆదిత్య ధర్ అడిగితే.. ఏ ఇండియన్ సూపర్ స్టార్ అయినా డేట్స్ ఇస్తాడు. వెంటనే ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ఓకే చెబుతాడు. అలాగే ఏ ప్రొడ్యూసర్ అయినా ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ఓకే చెబుతారు.
Aditya dhar | వర్మతో ఆదిత్య ధర్ సినిమా..?

ఇదిలా ఉంటే.. కొత్తగా ఆదిత్య ధర్ తెలుగులో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నారని.. అయితే.. దర్శకుడిగా కాదు.. నిర్మాతగా.. ఓ సినిమా నిర్మించాలి అనుకుంటున్నాడట. ఇంతకీ.. ఎవరి డైరెక్షన్ లో అంటే.. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేరు వినిపిస్తోంది. వర్మ గ్యాంగ్ స్టర్ సినిమాలతో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అదే జోనర్ లో ఈ సినిమా ఉంటుందని.. సత్య, కంపెనీ స్టైల్ లో రియలిస్టిక్ గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. సోషల్ మీడియాలో ఆదిత్య ధర్ పై వర్మ ప్రశంసల వర్షం కురిపిస్తుండడం.. రీసెంట్ గా ఆదిత్య ధర్ ను వర్మ ముంబాయిలో కలవడం.. చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ నిజమే అనిపిస్తుందని టాక్. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై వర్మ కానీ, ఆదిత్య ధర్ కానీ.. క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

