24thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

24thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
24thMarchCartoon | ట్రంప్ నిర్ణయం వెనుక కారణాలు
ప్రపంచ వ్యతిరేకత ప్రభావం
అమెరికా అంతర్గత పరిస్థితులు
వ్యూహాత్మక విరామమా? లేక వెనకడుగా?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నిన్నా మొన్నటి దాకా ఇరాన్ పై యుద్ధం ఆపేదే లేదంటూ బింకంగా ఉన్న ట్రంప్ యుద్ధానికి 5రోజుల విరామం ప్రకటించడం వెనుక ఉన్న కారణాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎంత మొండి ఘటం అయినా ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందేనని ఈ ప్రకటన రుజువు చేస్తోంది.
ప్రపంచం మొత్తం ఒకవైపు, ట్రంపు మాత్రమే ఒక వైపు అన్నట్టుగా మారింది పరిస్థితి. నిజానికి మొన్న హోర్ముజ్ వద్దకు రమ్మని ట్రంప్ పిలుపునిచ్చినప్పుడు మిత్రదేశాలేవీ స్పందించకపోవడంతోనే సీన్ అర్థమైపోయింది ట్రంప్ కి.
అమెరికాలో కూడా ట్రంప్ పాలనను, పద్ధతులను ఎవ్వరూ హర్షించడం లేదు. వ్యతిరేకపవనాలు బలంగా వీస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ట్రంప్ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని కూడా గట్టిగానే వినిపిస్తోంది.
అన్ని దేశాలతో శత్రుత్వం పెంచుకుని, తన దేశంలో వ్యతిరేకత మూటగట్టుకుని, తాను పొందేదేమిటి అని ట్రంప్ లో ఆలోచన మొదలైతే అదే చాలని అనుకుంటున్నారంతా. కానీ ఇది ముగింపా, లేక వ్యూహాత్మక విరామమా అనే అనుమానం కూడా లేకపోలేదు.
ఎందుకంటే కుదేలవుతోన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోడానికి,, తరిగిపోతున్న ఆయుధాలను తిరిగి కూడగట్టుకోడానికి తీసుకున్న వ్యవధి కూడా కావచ్చని విశ్లేషకుల అంచనా.
ఏదేమైనప్పటికీ, ట్రంప్ పైకి చెబుతున్నదొకటి, కానీ యుద్ధవిరామానికి ట్రంప్ ని వెనక్కి లాగుతున్న కారణాలు వేరు అని ఒక్క చిత్రంలో చూపించిన కార్టూన్ ఇది. ఇరాన్ కోసమే ఈ యుద్ధవిరామం అని గంభీరంగా అంటోన్న ట్రంప్ వెనకనుంచి సూటు పట్టుకు లాగుతున్న మూడు కారణాల వల్ల శాంతి నెలకొంటే అందరికీ సంతోషమే కదా.
గత రెండు దశాబ్ధాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.
