31నుండి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు

31నుండి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని లత్తవరం గ్రామంలోని కొండమీద ఉన్న, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈనెల 31వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలకు, పెద్ద ఎత్తున తరలిరావాలని గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోధపాటి గోవిందప్ప, కొర్రపాటి మల్లికార్జునలు పిలుపు నిచ్చారు.

సోమవారం ఉరవకొండలోని తహసిల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, వివిధ శాఖ కార్యాలయంలోని అధికారులకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలకు ఆహ్వాన పత్రికలను, నరసింహ స్వామి వారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply