Mahesh Goud | బీసీని సీఎం చేస్తామని కేసీఆర్ చెప్పగలరా..?

Mahesh Goud | బీసీని సీఎం చేస్తామని కేసీఆర్ చెప్పగలరా..?

Mahesh Goud | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బీసీని సీఎం చేస్తామ‌ని చెప్పే ద‌మ్ము బీజేపీకి ఉందా..? అలాగే కేసీఆర్, కేటీఆర్ బీసీని సీఎం చేస్తామ‌ని చెప్ప‌గ‌ల‌రా అని టీపీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ బీసీ వ్య‌తిరేక పార్టీ అన్నారు. 42శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లును అడ్డుకుంటోంద‌న్నారు.

తెలంగాణ‌కు బీసీ సీఎం కాంగ్రెస్ పార్టీ వ‌ల్లే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీసీ సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం అయ్యే అవకాశముందన్నారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ లకు ఆ ఛాన్స్ లేదన్నారు.

Leave a Reply