పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట గొఱ్ఱె కాపరులు ధర్నా..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సోమవారం గొఱ్ఱె కాపరులు ధర్నా నిర్వహించారు. గొర్రె కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి గొర్రెల కాపరులు తమ సంప్రదాయ దుస్త్రమైన గొంగడి ధరించి కలెక్టరేట్ వద్దకు చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు.

మార్కెట్ స్థలాల పరిరక్షణ, గొర్రెల పెంపకానికి సంబంధించిన సబ్సిడీలు, పశు వైద్య సేవల విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గొఱ్ఱె కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సలేంద్ర రాములు యాదవ్, మేకల నర్సయ్య యాదవ్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు దాడి చంద్రమౌళి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply