Balakrishna | యంగ్ డైరెక్టర్ కి ఓకే చెప్పారా…?

Balakrishna | యంగ్ డైరెక్టర్ కి ఓకే చెప్పారా…?
Balakrishna | బాలకృష్ణ నెక్స్ట్ మూవీపై క్లారిటీ వచ్చిందా?
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య కాంబో
రజినీకాంత్ ఎందుకు నో చెప్పారంటే..?
గ్యాంగ్స్టర్ కథతో బాలయ్యకు గ్రీన్ సిగ్నల్
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్
2027 సమ్మర్ రిలీజ్ ప్లాన్
Balakrishna | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నట సింహం బాలకృష్ణ.. అఖండ సినిమా నుంచి అఖండ 2 వరుకు వరుసగా సక్సెస్ సాధిస్తూ.. దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మలినేని గోపీచంద్ (Gopichand) తో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఈ మూవీ తర్వాత బాలయ్య సినిమా ఎవరితో అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు ఫిక్స్ అయ్యిందని.. ఓ యంగ్ డైరెక్టర్ కి ఓకే చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఆ యంగ్ డైరెక్టర్ రజినీతో మూవీ చేయాలి అనుకుంటే.. బాలయ్యతో ఫిక్స్ అయ్యిందనేది ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు..? అసలు ప్లాన్ ఏంటి…?
Balakrishna | బాలయ్య, వివేక్ ఆత్రేయ..
బాలయ్యని తన కథతో మెప్పించిన డైరెక్టర్ (Director) ఎవరంటే.. వివేక్ ఆత్రేయ అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వివేక్ ఆత్రేయ తొలి ప్రయత్నంలో సక్సెస్ సాధించాడు. ఆతర్వాత బ్రోచేవారెవరురా, అంటే.. సుందరానికీ, సరిపోదా శనివారం.. చిత్రాలు తెరకెక్కించాడు. ఇప్పటి వరకు యంగ్ హీరోలతో సినిమాలు చేసిన వివేక్ ఆత్రేయ ఈసారి రూటు మార్చాడు. సీనియర్ హీరోతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలని ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. ఆతర్వాత అదే కథను బాలయ్యకు చెబితే ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

Balakrishna | అందుకే.. రజినీ నో చెప్పారా…?
ఇంతకీ.. రజినీతో ఎందుకు వర్కవుట్ కాలేదు.. బాలయ్య ఎందుకు ఓకే చెప్పారంటే.. ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అని తెలిసింది. కూలీ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించాను కదా.. వెంటనే మళ్లీ గ్యాంగ్ స్టర్ గా నటిస్తే బాగోదనే ఉద్దేశ్యంతో రజినీ నో చెప్పారట. బాలయ్యకు చెబితే ఓకే చెప్పారట. బాలయ్య, వివేక్ ఆత్రేయ (Vivek Aatreya) ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది. అసలు సినిమా ఎలా ఉండబోతుందో..? బాలయ్యను ఎలా చూపిస్తాడో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అయితే.. బాలయ్యను స్టైలీష్ గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నాడట. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. 2027 సమ్మర్ లో రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని సమాచారం.

