ట్రాఫిక్ దిమ్మెను ఢీ కొట్టిన లారీ.. స్తంభించిన ట్రాఫిక్..

ట్రాఫిక్ దిమ్మెను ఢీ కొట్టిన లారీ.. స్తంభించిన ట్రాఫిక్..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్పీ చౌరస్తా వద్ద గల ట్రాఫిక్ దిమ్మెను సోమవారం ఉదయం లారీ ఢీకొట్టింది. డ్రైవర్ అజాగ్రత్తగా లారీని నడపడంతో ఢీకొట్టినట్టు స్థానికులు చెప్పారు. ఈ కారణంగా ఎమ్మార్పీ చౌరస్తా వద్ద ఆలంపల్లి రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు స్పందించి ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
