23rdMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

23rdMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
23rdMarchCartoon | అంతర్జాతీయ పరిణామాలు & మన దృష్టికోణం
యుద్ధ ప్రభావం భారత్‌పై ఎలా పడుతోంది?
గ్యాస్, పెట్రోల్ భయం – ప్రజల ఆందోళన
కార్టూన్లో చూపిన అమాయకత్వం

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అంతర్జాతీయ సంగతులు అందరికీ అర్థం కావు…అవి యుద్ధాలైనా, ఆందోళనలైనా సరే. అందులోంచి ఆనందమైనా, లాభమైనా, నష్టమైనా సరే మనం ఆలోచించేది ఒక్కటే…”మనకేంటి?” నిజమే…ఇది సగటు మనుషుల స్వార్థ చింతన…ఆమాటకొస్తే ఏస్థాయి అయినా సరే మానవులు ఆలోచించేది అదే.
పక్కోడిల్లు తగలడుతున్నా సరే, ఆ మంటలు మనింటిదాకా వస్తాయా? అవును..ఇది కఠిన సత్యం..కఠోర వాస్తవం. ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం గురించి కూడా అంతె. అక్కడి ప్రజలేమైపోతారు, ఎంతమంది పోతున్నారు…ఆ దేశానికెంత నష్టం, తప్పెవరిది అని కాదు.. ఆ యుద్ధం ప్రభావం మనకెంత? మన వద్ద ఏయే రంగాలపై పడుతుంది? మనకు గ్యాస్ దొరుకుతుందా? పెట్రోల్ దొరుకుతుందా? మన ఉద్యోగాలు ఉంటాయ, ఊడుతాయా? ఇక్కడ ధరలు ఏవి పెరుగుతాయి?
ఇదే క్రమంలో అక్కడ యుద్ధం ఆగిపోవాలని కోరుకునేవాళ్ళంతా ఇక్కడి గ్యాస్, పెట్రోల్ ధరలకు భయపడే అనేది వాస్తవం. ఈ పరిస్థితుల్లో భారత్ కి ఇరాన్ నుంచి మూడు ఎల్ పీజీ నౌకలు భారత్ చేరుకోవడం మనకు ఊరట కలిగించే విషయం. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారందరూ…అంతలోనే మరో ఆందోళన, సందేహం మొదలైంది.
అదేమిటంటే ఆ నౌకల్లోంచి ఎల్ పీజీ ఎంతమందికి చేరుతుంది? ఆ ఎల్ పీజీ అందుకునే వాళ్ళల్లో మనమూ ఉంటామా అని. సరే, అలాగనే పైరవీలు చేసి అక్కడి నౌకలోంచి డైరెక్టుగా మన ఇంట్లోని సిలెండర్ లోకి ఎల్ పీజీ తెప్పించుకోలేం గా? దానికీ కొన్ని పద్ధతులుంటాయి.
కానీ ఇవేవీ తెలియని ఇల్లాలు పాపం అక్కడికి వెళ్ళి డైరెక్టుగా తమ సిలెండర్ లోకి ఎల్ పీజీ నింపించుకు రమ్మని తన భర్తను ఆదేశిస్తోంది. అది ఆ ఇల్లాలి అమాయకత్వమా, సగటు మనుషుల ఆలోచనా ప్రతిబింబమా అనేది పాఠకులే నిర్ణయించుకోవాలి.
మాకేంటి అనే మానవుల మనస్తత్వాన్ని సింపుల్ గా ఆవిష్కరించిన ఆంధ్రప్రభ అందించిన కార్టూన్ ఇది.
గత రెండు దశాబ్ధాలుగా ఆంధ్రప్రభ పాఠకులను కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న ఆంధ్రప్రభ కార్టూన్ ఫీచర్ ఔరా.
