welcome | జన్నారం చేరుకున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ..

welcome | జన్నారం చేరుకున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ..

పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్..

ఈనెల 22 నుంచి 24 వరకు ఉమ్మడి జిల్లాలో పర్యటన..

జన్నారం,మార్చి 22 (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వులో రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదివారం రాత్రి 8 గంటలకు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ కు చేరుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,ఇతర అధికారులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. రాత్రి ఇదే రిసార్ట్ లో డిన్నర్ ముగించుకొని బసచేస్తారు.సోమవారం ఉదయం కవ్వాల అభయారణ్యంలోని అడవుల్లోని గిరిజనులతో ఆయన మోమేకమై సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.ఆ తర్వాత సంబంధిత అధికారులతోనూ సమావేశం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో కవ్వాల కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ,సీఎఫ్ శాంతారాం,స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్,మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు,ఎసీపీ ఆర్. ప్రకాష్, లక్షేటిపేట సీఐ రమణమూర్తి,స్థానిక ఇన్చార్జి తాహసిల్దార్ నేరెళ్ల రామ్మోహన్,స్థానిక హరిత రిసార్ట్ మేనేజర్ వీరేందర్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply