సీఎం సతీమణి నారా భువనమ్మ కుప్పంలో విస్తృత పర్యటన…

సీఎం సతీమణి నారా భువనమ్మ కుప్పంలో విస్తృత పర్యటన…

24నుండి నాలుగు రోజులు నాలుగు మండలాల్లో పర్యటన

కుప్పం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లో నాలుగు రోజుల పాటు విస్తృత పర్యటన, శుభాకార్యాలు, పరామర్శలు, పార్టీ కార్యక్రమలు, పాఠశాలల సందర్శన, దేవాలయలకు వెళ్లడం, మహిళల తో ప్రత్యేక సమావేశాలు వంటి కార్యక్రమల షెడ్యూల్ తో నారా భువనమ్మ పర్యటన ఖరారైంది. ఈ నెల 23 రాత్రి శాంతిపురం నివాసానికి చేరుకుని 24 నుంచి 4 రోజుల పాటు కుప్పంనియోజకవర్గంలోని 4మండలాల్లోపర్యటించనున్నారు.

రైతులు, యువత, మహిళల తో సమావేశం కానున్నారు. 24న కుప్పం రూరల్ మండలం లోని మంకలదొడ్డి గ్రామంలో మహిళలలో ముఖాముఖి కార్యక్రమం,అంగన్వాడీ సెంటర్ ను సందర్శించనున్న నారా భువనమ్మ.సింగారపురం గ్రామంలో మహిళలతో సమావేశం,మొట్లచెను గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం,కూసూరులో మహిళలతో సమావేశం రైతన్న మీ కోసం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించనున్న నారా భువనమ్మ.

అదేవిధంగాపైపాల్యం గ్రామంలో విలువల బడిలో భాగంగా విద్యార్థులతో సమావేశం నిర్వహించికుప్పం పట్టణం లోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొనున్న ఆమె పాల్గొనున్నారు. 25 వ తేదీన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి కడ అడ్వైజర్ మెంబర్ రాజకుమార్ ఇంటి గృహ ప్రవేశంలో నారా భువనమ్మ పాల్గొనున్నారు.అదే రోజు కుప్పం డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాలో పాల్గొని గుడుపల్లి మండలం పెద్దకోటకనపల్లిలో మహిళలతో భువనమ్మ సమావేశం కానున్నారు.

సాయంత్రం తంబిగానిపల్లిలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ ఇంటికి భువనమ్మ వెళ్లనున్నారు. 26వ తేది నాడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి నారా భువనమ్మ శాంతిపురం మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. అదే విధంగా గుండిశెట్టిపల్లిలో ఐటీడీపి కార్యకర్త రవి కుటుంబ సభ్యులను పరామర్శించి నారా భువనమ్మ రామకుప్పం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని విష్కరించనున్నారు.

రామకుప్పం మండల కేంద్రంలో కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో నారా భువనమ్మ పాల్గొని బల్ల గ్రామంలో మహిళలతో ముఖాముఖి కానున్నారు. కుప్పం పట్టణంలో టీడీపీ నేత గోపీనాథ్ కు చెందిన కాంప్లెక్స్ ను ప్రారంభించి తమ స్వగృహం లో బస చేయనున్నారు.27 తేదిన కుప్పం పట్టణంలో వెలసిన రామలింగేశ్వర దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలల్లో భువనమ్మ పాల్గొనున్నారు.

ఇటీవల ప్రమాదం కు గురై మరణించిన బాల కుమార్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం కుప్పం టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో నారా భువనమ్మ పాల్గొనున్నట్లు తెలిసింది.

Leave a Reply